పోలింగ్ కు 48 గంటల ముందు కడప జిల్లాలో ఎక్కడా మద్యం విక్రయించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని కడప జిల్లా ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంటు అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే అక్రమ మద్యం విక్రయిస్తున్న పది దుకాణాలను సీజ్ చేసి.. వారి లైసెన్సులు కూడా రద్దు చేశామని తెలిపారు. మరో 30 దుకాణాలపై కేసులు నమోదు చేశామన్నారు. గత ఏడాది మార్చి-ఏప్రిల్ నెలలో ఎంత మోతాదులో మద్యం సరఫరా చేశామో... ఇపుడూ అంతే సరఫరా చేస్తున్నామన్నారు. కర్నాటక నుంచి వచ్చే అక్రమ మద్యంపై నిఘా పెట్టామని పేర్కొన్నారు.
మద్యం విక్రయిస్తే చర్యలే..: ఎక్సైజ్‌శాఖ - కడపజిల్లా
కడప జిల్లావ్యాప్తంగా పోలింగ్ ముగిసే వరకూ మద్యం విక్రయించకుండా చర్యలు చేపట్టాం. ఎవరైన రూల్స్‌ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పక్క రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే అక్రమ మద్యం రవాణాపై దృష్టి సారించాం. - శ్రీనివాసరావు, కడప జిల్లా ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్

కడప జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ముగిసే వరకూ మద్యం విక్రయించకుండా చర్యలు.
కడప జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ముగిసే వరకూ మద్యం విక్రయించకుండా చర్యలు.
ఇవీ చూడండి.