ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి(సెప్టెంబరు 2) సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సెప్టెంబర్ 1న సాయంత్రం ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అన్బురాజన్.. సబ్ కలెక్టర్ పృథ్వితేజ్తో కలిసి పరిశీలించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
సెప్టెంబరు 2న ఉదయం 8గంటలకు ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించనున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో కడప విమానాశ్రయం బయల్దేరుతారు. అక్కడ్నుంచి విమానమార్గం ద్వారా విజయవాడకు రానున్నారు.