వ్యాక్సినేషన్ డ్రైవ్..
గుంటూరు నగరంలో విదేశాలకి వెళ్లేవారికి, వికలాంగులకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు నగర కమిషనర్ చల్లా అనురాధ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్లో టీకా అందిస్తున్నట్లు తెలిపారు. 45 ఏళ్లు నిండిన వారికి తొలి డోసు, తొలి డోసు తీసుకొని 84 రోజులు గడిచిన వారికి కోవిషీల్డ్ రెండో డోసు నేడు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని.. ఏ.టి.అగ్రహారం యస్.కె.బి.యం. హై స్కూల్, పాత గుంటూరులోని శ్రీ కృష్ణ కమ్యూనిటి హాల్, మంగళదాస్ నగర్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్, కొత్త పేట జలగం రామారావు స్కూల్, పట్టాభిపురం హై స్కూల్, జిల్లా పరిషత్ రోడ్ లోని భారతీయ విద్యా భవన్, సంపత్ నగర్ సరస్వతి శ మందిరం, గోరంట్ల మున్సిపల్ ప్రైమరీ స్కూల్, లాలాపేట లాల్ జాన్ బాష ఫంక్షన్ హాల్, గుజ్జన గుండ్లలో ప్రభుత్వ మహిళా పాల్ టెక్నిక్ కళాశాల, బ్రాడిపేట మాజేటి గురవయ్య స్కూల్, అమరావతి రోడ్ 140 సచివాలయం, సంజీవయ్య నగర్ పినపాటి ప్రభుదాస్ మున్సిపల్ పాఠశాలల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
ఆదర్శ వార్డులుగా తీర్చిదిద్దుతాం..
నగరంలోని 7, 32 వార్డులను క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా అభివృద్ధి చేయనున్నట్లు నగర కమిషనర్ తెలిపారు. అక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్- 2016 ప్రకారం.. చెత్త, వ్యర్ధాల సేకరణకు ప్రతి గృహం, వ్యాపార వాణిజ్య సంస్థలు తప్పనిసరిగా యూజర్ చార్జీలు చెల్లించాలని వెల్లడించారు.