ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Dogs Parade: ప్రజారక్షణలో.. మేము సైతం అంటున్న జాగిలాలు

Police Dogs Parade: గుంటూరు నిఘా విభాగం ఆధ్వర్యంలో 35 పోలీసు జాగిలాలు.. 8నెలల శిక్షణ పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా పరేడ్‌ నిర్వహించారు. పరేడ్​లో హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. పోలీసులంతా క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని హోంమంత్రి అన్నారు. పోలీసు జాగిలాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రతిభ చాటిన జాగిలాలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. పరేడ్ ముగింపులో జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. జాగిలాలకు శక్షణ ఇచ్చిన అధికారులను హోం మంత్రి అభినందించారు.

Police Dogs Parede
శిక్షణ పూర్తి చేసుకున్న 35 జాగిలాలు

By

Published : Sep 28, 2022, 3:31 PM IST

Police Dogs: దొంగలను పట్టుకోవడానికి నిరంతరం పోలీసులు శ్రమిస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో పోలీసులకు సైతం అంతు చిక్కని మిస్టరీ కేసులు తారస పడుతూ ఉంటాయి. వాటిని ఛేదించడంలో పోలీసులకు​ జాగిలాలు ఏంతగానో ఉపయోగపడుతుంటాయి. అలా పోలీసులకు సహాయం అందిచడం కోసం గత ఎనిమిది నెలలుగా శిక్షణ తీసుకుంటున్నాయి ఆ జాగిలాలు. యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా రెడీ అయ్యాయి. హోం మంత్రి చేతుల మీదగా బహుమతులు సైతం అందుకున్నాయి. గుంటూరు నిఘా విభాగం ఆధ్వర్యంలో 35 పోలీసు జాగిలాలకు 8నెలల శిక్షణ ఇచ్చారు. జాగిలాలు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా వాటితో పరేడ్ కార్యక్రమం నిర్వహించారు.

పోలీసు జాగిలాల నుంచి హోం మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ విభాగాలలో ప్రతిభ చాటిన జాగిలాలకు తానేటి వనిత బహుమతులు ప్రదానం చేశారు. పరేడ్ ముగింపు సందర్భంగా జాగిలాలు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శిక్షణ పూర్తి చేసుకున్న 35 జాగిలాలను వివిధ జిల్లాలకు పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో మన రాష్ట్ర పోలీసులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని హోం మంత్రి చెప్పారు. పోలీసులంతా క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి తానేటి వనిత వెల్లడించారు.

శిక్షణ పూర్తి చేసుకున్న 35 జాగిలాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details