కక్షిదారుల నగదు చెల్లించాలని న్యాయవాదుల నిరసన - boycott
రాష్ట్రవ్యాప్తంగా న్యాయస్థానాల్లో కక్షిదారులకు చెందిన నగదు చెల్లింపు నిలిపివేసినందుకు నిరసనగా గుంటూరు జిల్లాలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.
రాష్ట్రవ్యాప్తంగా న్యాయస్థానాల్లో కక్షిదారులకు చెందిన నగదు చెల్లింపు నిలిపివేసినందుకు నిరసనగా గుంటూరు జిల్లాలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. గత ఐదు నెలల నుంచి కక్షిదారులకు చెందిన నగదును చెల్లించకుండా ఖజానా శాఖ నిలిపివేసిందని... దీనితో కోట్ల రూపాయలు నగదు చెల్లింపులు నిలిచిపోయాయని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలుకూరి నరేంద్రబాబు వెల్లడించారు. కక్షిదారులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు వడ్డీ కోల్పోతున్నారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కక్షిదారు నగదు ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా చెల్లింపులు నిలిపివేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయమూర్తులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. వెంటనే నగదు చెల్లింపులు జరపాలని లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని నరేంద్ర బాబు పేర్కొన్నారు.