ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వృద్ధాశ్రమాల్లోని 500 మంది నిరుపేదలకు చేయూత - old age homes

గుంటూరు నగరంలోని వృద్ధాశ్రమాలకు బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి ఫౌండేషన్- రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేయూత ఇచ్చారు. ఆశ్రమాల్లో ఉంటున్న వృద్ధులకు దుప్పట్లు, బియ్యం, పండ్లు పంపిణీ చేశారు.

helping to oldage home at guntur
నగరంలోని వృద్ధాశ్రమాల్లో ఉన్న 500 మంది నిరుపేదలకు చేయూత

By

Published : Dec 27, 2020, 5:41 PM IST

బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి ఫౌండేషన్ - రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని వృద్ధాశ్రమాల్లో దుప్పట్లు, బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని వివిధ వృద్ధాశ్రమాలలో ఉన్న 500 మంది నిరుపేద వృద్ధులకు చేయూత ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. వృద్ధులకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన డాక్టర్ బొమ్మిడాల కృష్ణమూర్తి సేవలను కొనియాడారు.

పేదల అవసరాలను తీర్చడంలో వచ్చే ఆనందాన్ని, అనుభూతిని ప్రతి ఒక్కరూ పొందాలని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. కృష్ణమూర్తి దాతృత్వానికి మరో పేరుగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి రవి శ్రీనివాస్, బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి ట్రస్టీ పెండ్యాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నగరంలోని వృద్ధాశ్రమాల్లో ఉన్న 500 మంది నిరుపేదలకు చేయూత

ABOUT THE AUTHOR

...view details