Patent for new medicine: గుంటూరు జిల్లా బాపట్ల ఫార్మసీ కళాశాల ప్రధానోపాధ్యాయులు తలశిల గోపాలకృష్ణమూర్తి.. రెండు కొత్త ఔషధ సమ్మేళనాలు రూపొందించి.. కేంద్ర పేటెంట్ కార్యాలయం నుంచి పేటెంట్ హక్కులు సాధించారు. సాధారణంగా రక్తపోటు(బీపీ) సమస్యతో బాధపడేవారు టెల్మీసార్టాన్ ఔషధం మాత్రల రూపంలో తీసుకుంటారు. ఇది రక్తంలో పూర్తిగా కరగపోవటంతో ఆలస్యంగా పనిచేస్తోంది. నానో సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఔషధం పూర్తిగా రక్తంలో కరిగి తక్కువ సమయంలో సమర్థంగా పనిచేసేలా గుళికల(క్యాప్సుల్స్) రూపంలో గోపాలకృష్ణమూర్తి రూపొందించారు. గాయాలు త్వరగా మానేందుకు కొల్లాజెన్, స్టాటిన్, ఆవు మూత్రం కలిపి మరో సమ్మేళనం తయారు చేశారు. ఫిల్మ్ రూపంలో ఉండే ఈ ఔషధాన్ని గాయాలపై ఉంచితే ఇన్‌ఫెక్షన్ల సమస్య తగ్గి త్వరగా మానతాయని ఆయన తెలిపారు. గతంలోనూ ఆయన ఐదు ఔషధ సమ్మేళనాలు తయారు చేసి పేటెంట్లు పొందారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు తదితరులు ఆయన్ను అభినందించారు.
మాకు ఇటీవల రెండు పేటెంట్లు రావటం జరిగింది. ఒకటేమో గాయాలు జరిగినప్పుడు.. అంటే షుగర్ పేషంట్లకు గాయాలు తగ్గాలంటే చాలా కష్టమవుతుంది. ఒక్కోసారి గ్యాంగ్రియాన్ పేరుకుని కాలు కూడా తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్లకి గాయం త్వరగా తగ్గటం కోసం కొల్లాజన్ కో ఫిలిం అనేవి చేస్తుంటారు. మన పూర్వకాలం నుంచి కొలాజన్ పిల్స్ వాడటం అనేది ఉంది. దాంతో పాటు కొలస్ట్రాల్ ఎవరికైతే ఉంటుందో.. వాళ్లు స్టాటిన్స్ అని చెప్పే డ్రగ్స్.. ట్యాబెట్ల రూపంలో తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. మేము ఆ స్టాటిన్ అనేది చర్మం మీద అంటిస్తే.. దాని మూలంగా ఊండ్ హీలింగ్ యాక్టివిటీ(Wound healing activity) పొటెన్షియేట్ అవటం అనేది జరుగుతుంది. అందుకని కొల్లాజన్ ఫిలింలో స్టాటిన్ అనే డ్రగ్‌ను ఇన్ కార్పొరేట్ చేయటం జరిగింది. ఈ ఫిలిం అనేది సాల్వెంట్ క్యాస్టింగ్ టెక్నిక్(solvent casting technique)లో తయారుచేశాం. సాల్వెంట్ క్యాస్టింగ్‌కి.. సాల్వెంట్‌గా గోమూత్రాన్ని(cow urine) వాడాం. గోమూత్రం అనేది మన చరిత్రలో చాలా ఔషద గుణాలున్నాయని చెప్పి.. దానికి యాంటీసెప్టిక్, యాంటి మైక్రోబియల్ ప్రాపర్టీస్, ఊండ్ హీలింగ్ యాక్టివిటీ కూడా ఉన్నట్లు రిపోర్టులు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ మూడు కలిపామో.. ఆ వచ్చే ప్రాడెక్టుకు చాలా ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది. ఒక్కొక్కటిగా కలిపే దానికన్నా కూడా.. కొల్లాజన్ క్యాప్య్సూల్స్ ఇంపెగ్ర్నెంటెడ్ విత్ స్టాటిన్స్ ఇన్ ప్రజన్స్ ఆఫ్ కౌ యూరిన్(collagen capsules impregnated with statins in presence of cow urine) అనే ఇన్నోవేషన్‌కి ఒక పేటెంట్ రావటం జరిగింది. ఈ పేటెంట్ రావటానికి మా విద్యార్థులు కృషి, శ్రమ చాలా ఉంది. ఫ్యాకల్టీగా మేము గైడెన్స్ ఇవ్వగలం తప్పితే.. చేయవల్సింది విద్యార్థులే. వారి అంకితభావం, అలాగే వాటిని తయారు చేయటానికి మా కళాశాల ఎంతో తోడ్పాటునిచ్చింది. -తలశిల గోపాలకృష్ణమూర్తి
రెండో పేటెంట్..
బయో ఫార్మాసూటికల్ క్లాసిఫికేషన్ సిస్టం సెకండ్ కాటగిరీ అని రెండు డ్రగ్స్ ఉంటాయి. వాటిని మన శరీరంలోకి తీసుకున్న తరువాత.. మన ఓంట్లో ఉన్న ఫ్లూయిడ్స్‌లో త్వరగా కరగవు. దాని మూలంగా రక్తంలోకి తీసుకున్న డ్రగ్ మొత్తం వెళ్లటమనేది జరగదు.