ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Boyapati On Ongole Bulls: ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు ప్రభుత్వం చేయూతనివ్వాలి: బోయపాటి

Boyapati On Ongole Bulls: ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు ప్రభుత్వం చేయూతనివ్వాలని సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా కొప్పూరావూరులో జరుగుతున్న ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలకు ఆయన హాజరయ్యారు.

Boyapati On Ongole Bulls
ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు ప్రభుత్వం చేయూతనివ్వాలి

By

Published : Dec 29, 2021, 1:33 PM IST

ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు ప్రభుత్వం చేయూతనివ్వాలి

Boyapati On Ongole Bulls : ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు ప్రభుత్వం కూడా చేయూతనివ్వాలని సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా కొప్పూరావూరులో జరుగుతున్న ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలకు ఆయన హాజరయ్యారు. ఎడ్ల పందాలను ఉత్సాహంగా తిలకించారు.

ఒంగోలు జాతి ఎద్దులు తెలుగువారికే కాక.. భారత దేశానికి గర్వకారణమన్నారు. ఎంతో ప్రత్యేకమైన, దృఢమైన ఈ జాతి పశువుల్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా ఒంగోలు జాతి ఎద్దుల గొప్పదనం అందరికీ తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఒక రైతు బిడ్డగా ఈ ఎద్దుల గురించి తెలుసు కాబట్టే అఖండ సినిమాలో చూపించానని తెలిపారు. తనకేం కావాలో రైతులకు ముందుగానే చెప్పానని.. అందుకే అత్యంత సహజంగా అఖండ సినిమాలో ఎద్దులు కనిపించాయని వివరించారు.

ఇదీ చదవండి : Cinema Theater Seize: పాతపట్నంలో ఉమా మహల్​ థియేటర్​ సీజ్​

ABOUT THE AUTHOR

...view details