పశ్చిమగోదావరి జిల్లాలో 9 మంది కరోనా బాధితులు కోలుకుని ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. ఏలూరు కోవిడ్ ఆస్పత్రి నుంచి వారిని వైద్యులు నిబంధనల మేరకు ఇళ్లకు పంపించారు. ఏలూరుకు చెందిన ఆరుగురు, భీమవరం పట్టణానికి చెందిన ఇద్దరు, పెనుగొండకు చెందిన ఒకరిని డిశ్చార్జ్ చేశారు. వీరంతా దిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్నవారు. మార్చి 31న వీరికి కరోనా ఉన్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి ఏలూరు కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం తిరిగి పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నెగిటివ్ రావడం, ఆరోగ్యంగా ఉండటం వల్ల.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలోని ఐసొలేషన్ వార్డు నుంచి బయటకు వస్తున్న వారిని వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కరతాళ ధ్వనులతో బయటకు ఆహ్వానించారు. 9 మంది డిశ్చార్జ్ కావడం రాష్ట్రంలో మొదటిసారని వైద్యులు తెలిపారు. జిల్లాలో కోవిడ్ బాధితుల సంఖ్య 35కు చేరుకోగా.. ఇంకా 24మంది చికిత్స పొందుతున్నారు.
ఏలూరు కోవిడ్ ఆసుపత్రి నుంచి 9 మంది డిశ్చార్జ్
పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఏలూరుకు చెందిన ఆరుగురు, భీమవరానికి చెందిన ఇద్దరు, పెనుగొండకు చెందిన ఒకరిని ఏలూరు కోవిడ్ ఆస్పత్రి నుంచి ఇళ్లకు పంపించారు. వీరంతా దిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్నవారు. మార్చి 31న వీరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. అప్పటి నుంచి ఏలూరు కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కరోనా కేసులు నమోదవుతున్న తర్వాత రాష్ట్రంలో ఒకేసారి 9మంది డిశ్చార్జ్ కావడం మొదటిసారని వైద్యులు తెలిపారు.
ఏలూరు కోవిడ్ ఆసుపత్రి నుంచి 9 మంది డిశ్చార్జ్