ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని(ఈబీసీ) 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ‘ఈబీసీ నేస్తం’ పథకం ద్వారా ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు బీసీ సంక్షేమ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా 2020-21 నాటికి రాష్ట్రంలో మొత్తం 4,47,040 మంది అర్హులు ఉన్నట్లు పేర్కొంది. వీరికి ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు సాయం అందిస్తే రూ.2011.68 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాపు నేస్తం లబ్ధిదారులు, వైఎస్‌ఆర్ చేయూత కింద సాయం పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ పథకం వర్తించదు. గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటి సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తించి సచివాలయాల్లోని సంక్షేమ సహాయకునికి అందిస్తారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తులను పరిశీలించి బీసీ కార్పొరేషన్ ఈడీలకు పంపిస్తారు. తుది జాబితాకు కలెక్టర్లు ఆమోదం తెలిపిన అనంతరం బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదలవుతాయి.
4.47 లక్షల మందికి ‘ఈబీసీ నేస్తం’ - women are going to benefit with e-bc nestham scheme latest news
రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని(ఈబీసీ) 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు.. ‘ఈబీసీ నేస్తం’ పథకం ద్వారా సాయం అందనుంది. ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు.. బీసీ సంక్షేమ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
4.47 లక్షల మందికి ‘ఈబీసీ నేస్తం’