దేవదాస్ కనకాల మృతిపై ప్రముఖుల నివాళులు - Tributes paid to the demise of Devadas Kanakala
సినీ నటుడు దేవదాస్ కనకాల మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. దేవదాస్ కనకాల మృతి విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

దేవదాస్ కనకాల మృతిపై ప్రముఖుల నివాళులు
దేవదాస్ కనకాల మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేవదాస్ కనకాల మృతి విచారకమకరమని అన్నారు. నటనా శిక్షణ సంస్థ ద్వారా అగ్రనటుల్ని తెలుగు తెరకు అందించారని గుర్తు చేశారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. దేవదాస్ కనకాల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.