- రోడ్డెక్కాయి...
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీకి ఉన్న 12 వేల బస్సుల్లో 17 శాతం బస్సులు రోడ్డెక్కాయి. ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- న్యాయవాదుల బృందం
జల వివాదాలపై వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏఏ అంశాలను పర్యవేక్షించాలనే అంశంపై ఉత్తర్వులు ఇచ్చింది.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- ఖాతాల లూటీ
కొవిడ్-19 సమాచారాన్ని తెలుసుకోండి’ అంటూ మీ సెల్‌ఫోన్లకు సందేశాల రూపంలో ఏవైనా లింకులు వస్తున్నాయా? వాటిపై ట్యాప్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. పొరపాటున ముట్టుకుంటే బ్యాంకు ఖాతాలోని సొమ్ము క్షణాల్లో ఖాళీ అయిపోవచ్చు. సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తుగడ ఇది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- అరకోటి కేసులు
ప్రపంచదేశాలపై కరోనా మహహ్మారి పంజా విసురుతోంది. ఐదు నెలల క్రితం చైనాలో మొదలైన వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఉద్ధృతిని పెంచుకుంటూ మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య అరకోటి దాటింది. మృతుల సంఖ్య దాదాపు 3 లక్షల 30వేలకు చేరువైంది.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- చైనాలో మళ్లీ కరోనా..!
తన స్వస్థలం చైనాలో మళ్లీ ప్రతాపం చూపిస్తోంది కరోనా. జిలిన్ ప్రావిన్స్‌లో కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో మే20 నుంచి లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- వారిలో వైరస్ బలహీనం..