- POLAVARAM: పోలవరం భూకుంభకోణంలో కదులుతున్న అక్రమాల డొంక..
POLAVARAM:పోలవరం ప్రాజెక్టు భూముల పరిహారం పంపిణీ అక్రమాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక గ్రామాల గిరిజనులు తమకు ఇంకా పరిహారం అందలేదని చెప్పడం, ఇప్పటికే వారి భూములకు పరిహారం చెల్లించినట్లు రికార్డుల్లో నమోదై ఉన్న అంశాలు బయటపడుతూనే ఉన్నాయి. దాదాపు రూ.50 కోట్ల వరకు ఇలాంటి అక్రమాలు జరిగి ఉంటాయని విశ్వసనీయ వర్గాల కథనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Food security rankings: ఆహార భద్రత చట్టం అమలులో రాష్ట్రానికి 3వ ర్యాంకు
Food security rankings: జాతీయ ఆహార భద్రత చట్టం అమలులో.. రాష్ట్రానికి 3వ స్థానం లభించింది. మంగళవారం దిల్లీలో జరిగిన సదస్సులో కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌గోయల్ తొలిసారి జాతీయ ఆహార భద్రత చట్టం సూచీ ర్యాంకులను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Assembly sessions: జులై 19 నుంచి శాసనసభ సమావేశాలు
Assembly sessions: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను.. ఈ నెల 19 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సలహా మండళ్ల భేటీలను 18న లేదా 19న నిర్వహించి సమావేశాల ఎజెండాను ఖరారు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత.. కోనసీమ అల్లర్ల కేసులో హైకోర్టు ఉత్తర్వులు
High court on konaseema issue: కోనసీమ అల్లర్ల వ్యవహారంలో అమలాపురం పోలీసులు నమోదు చేసిన కేసులో.. నిందితుల ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వారి పిటిషన్లను కొట్టేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వంటింట్లో మంట.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది. 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దిల్లీలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో రూ.1053కు చేరుకుంది. హైదరాబాద్‌లో గ్యాస్ బండ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ముదురుతున్న 'కాళీ' పోస్టర్ వివాదం.. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌పై కేసు
'కాళీ' డాక్యుమెంటరీ పోస్టర్ తీవ్ర వివాదానికి దారితీసింది. మతపరమైన మనోభావాలను దర్శకురాలు లీనా దెబ్బతీశారని, ఆమెను అరెస్టు చేయాలంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో లీనా మణిమేగలై స్పందించారు. తాను నమ్మిన విషయాన్ని బతికున్నంతవరకూ నిర్భయంగా చెబుతానంటూ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ముషారఫ్‌కు కళ్లెం వేసిన కలాం.. కశ్మీర్‌పై మాట్లాడకుండా చేసి..
Abdul Kalam Musharraf: భారత పర్యటనకు వచ్చిన నాటి పాకిస్థాన్ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌ను కశ్మీర్‌పై మాట్లాడనీయకుండా వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం. వ్యూహాత్మకంగా సంభాషణ ప్రారంభించి కశ్మీర్ గురించి ముషారఫ్ మర్చిపోయేలా చేశారు. రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్న వేళ.. ఆనాడు జరిగిన సంఘటనను ఓసారి గుర్తుచేసుకుంటే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బోరిస్ జాన్సన్‌కు షాక్.. రిషి సునాక్ రాజీనామా.. మరో మంత్రి కూడా..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సర్కార్ రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వం నుంచి వైదొలగడం బాధాకరమని రిషి సునాక్ తన లేఖలో పేర్కొన్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగడం కష్టసాధ్యం అని తెలిపారు. ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IND VS ENG: ఐదో టెస్టులో నమోదైన రికార్డులివే
IND VS ENG Fifth test records: ఐదో టెస్ట్‌లో టీమ్ఇండియాపై ఇంగ్లాండ్ 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ 2-2తో సమమైంది. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్టైలిష్ ఏజెంట్‌గా వరుణ్‌తేజ్.. దర్శకుడు ఎవరంటే?
హీరో వరుణ్‌తేజ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ భిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ గూఢచారి పాత్ర కోసం ఆయన ప్రస్తుతం తన లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నారు. దీంతో పాటు ఇంకా పలు సినిమా సంగతులు ఉన్నాయి. అవేంటంటే..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.