ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 7 PM - ap top ten news

.

top news
top news

By

Published : Jun 1, 2021, 7:01 PM IST

  • Jagan Review: అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి: సీఎం

గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల మధ్య అనుసంధానం ఉండాలని సీఎం జగన్ సూచించారు. అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ (ఏఐఎఫ్‌) ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Anandaiah: ఔషధ తయారీని త్వరలోనే ప్రారంభిస్తాం: ఆనందయ్య

కరోనా మందు పంపిణీపై నెల్లూరులో కలెక్టర్ చక్రధర్​బాబుతో ఆనందయ్య సమావేశమయ్యారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఔషధ పంపిణీ ఉంటుందని ఆనందయ్య వెల్లడించారు. కరోనా మందు ప్రక్రియ పూర్తైతే, సోమవారం నుంచే మందు పంపిణీ ప్రారంభిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • YV subbareddy: 'ఆనందయ్య ఔషధానికి ఆయుర్వేద గుర్తింపు వస్తేనే తితిదే ద్వారా పంపిణీ'

ఆనందయ్య(anadaiah) ఔషధంపై ఆయుష్ సహా సీసీఆర్ఎఆస్ సంస్థలు చేపట్టిన పరిశోధనల్లో కరోనా తగ్గుతుందని ఎక్కడా ఎవరూ చెప్పలేదని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV subbareddy) తెలిపారు. ఆ మందు ఆయుర్వేదం కాదని పరిశోధనల్లో తేలినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Covid Cases : రాష్ట్రంలో కొత్తగా 11,303 కేసులు, 104 మరణాలు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. మరోవైపు మరణాల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది. కొత్తగా 11,303 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • దేశంలో కొత్త ఫంగస్- ఆగ్రాలో తొలి కేసు

బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్​లకు అదనంగా ఆస్పర్​గిలస్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. ఉత్తర్​ప్రదేశ్ ఆగ్రాలోని ఓ రోగికి ఈ వ్యాధి నిర్ధరణ అయింది. ఈ వ్యాధి చికిత్స బ్లాక్ ఫంగస్ మాదిరి కాదని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఆ గ్రామంలో ఒక్క నెలలో 80మంది మృతి!

కర్ణాటకలోని సమ్వసుద్ధి గ్రామంలో ఒక్క నెలలో 80మందికి కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితి గురించి గ్రామస్థులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరణాల సంఖ్యపై అధికారులు ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు సమర్పిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • రోడ్డుపై దిగిన విమానం- వాహనదారులు షాక్

అమెరికాలోని కాలిఫోర్నియాలో సోమవారం ఓ తేలికపాటి విమానం ఫ్రీవేపై అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. పశ్చిమ లాస్​ఏంజెల్స్​కు సమీపాన ఉన్న వాన్​ నూయ్స్​ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం.. అగౌర హిల్స్​లోని 101 రహదారిపై దిగాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Covid-19: మరో కొత్త డ్రగ్​కు అనుమతులు

కరోనా చికిత్స కోసం ఎలి లిల్లీ అండ్​ కంపెనీ అభివృద్ధి చేసిన యాంటీ బాడీ డ్రగ్​ కాంబినేషన్​కు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది కేంద్రం. లక్షణాలు స్వల్పంగా- తక్కువ తీవ్రత ఉన్న వారికి ఈ ఔషధాన్ని అందించవచ్చని సంస్థ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • టోక్యో ఒలింపిక్స్​ నుంచి వైదొలిగిన మారిన్

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ టోక్యో ఒలింపిక్స్​ నుంచి తప్పుకుంది. గాయం కారణంగా ఈ వారం చివర్లో సర్జరీ చేయించుకోనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • భార్యను కొట్టిన బుల్లితెర నటుడు అరెస్టు

హిందీ బుల్లితెర నటుడు కరణ్​ మెహ్రాను సోమవారం ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. గృహహింసకు పాల్పడుతున్నాడని కరణ్​ భార్య, నటి నిషా రావల్​ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల అతడిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details