- PERNI NANI COMMENTS ON RGV: సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగా భావించట్లేదు: పేర్ని నాని
సినిమా టికెట్ల ధరలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లపై మంత్రి పేర్ని నాని స్పందించారు. రూ.100 టికెట్ ను వెయ్యి, 2 వేలకు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పిందని ప్రశ్నించారు. డిమాండ్, సప్లయ్ అంటారా....లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా అని నిలదీశారు. సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి ఉండకూడదని అభిప్రాయపడ్డారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'కమిషన్ల కోసం ప్రజల ఆస్తుల తాకట్టుకు శ్రీకారం చుట్టారు'
గ్రహణ కాలం 2021 పేరిట తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓ వీడియో విడుదల చేశారు. గత ఏడాది పాలనా వైఫల్యాలతో వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోవటంతో పాటు పేదలపై మోయలేని ఆర్ధిక భారo మోపారని ఆ వీడియో ద్వారా వివరించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- టిక్కెట్ లేని ప్రయాణికులకు రూ.2.05 కోట్ల జరిమానా..
తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్లో గతేడాది డిసెంబరు నెలలో టిక్కెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.2.05 కోట్ల మేర అపరాధ రుసుము వసూలు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఐదు ప్రత్యేక బృందాలు, ఇతర సిబ్బంది శ్రమించి టిక్కెట్లు లేని ప్రయాణికులను గుర్తించి 35,342 కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- EBC NESTHAM: 9న ‘ఈబీసీ నేస్తం’ సాయం
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ‘ఈబీసీ నేస్తం’ పథకానికి 3,92,674 మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం కింద ఈబీసీ వర్గానికి చెందిన 45-60ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.15వేల చొప్పున సాయాన్ని అందిస్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దేశంలో కరోనా విజృంభణ - ఒక్కరోజే 58వేల కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే 58,097 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో 534 మంది ప్రాణాలు కోల్పోయారు. 15,389 మంది కొత్తగా కోలుకున్నారు. దేశంలో రోజువారీ కొవిడ్ పాజిటివిటీ రేటు 4.18 శాతంగా ఉంది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం