అమెరికా టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు.
అసలేం జరిగిందంటే..?
మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంటకు చెందిన జి.నరసింహారెడ్డి, లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. నరసింహారెడ్డి హైదరాబాద్-1 డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నారు.
పిల్లలు ఇద్దరు అమెరికా టెక్సాస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. 6 నెలల క్రితం కుమారుడు, కుమార్తె వద్దకు నరసింహారెడ్డి దంపతులు వెళ్లారు. కుమార్తె వివాహం కుదుర్చుకునేందుకు టెక్సాస్ వెళ్లగా.. అక్కడ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో దంపతులు నరసింహారెడ్డి, లక్ష్మి, కుమారుడు భరత్‌రెడ్డి మృతి చెందారు. కుమార్తె మౌనికకు ప్రమాదంలో తీవ్రగాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు బంధువులు అక్కడే ఉన్న తానా/ఆట సంఘం సభ్యులను సంప్రదిస్తున్నారు. నరసింహారెడ్డి హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.
ఇదీ చదవండి:
దారుణం.. సైనైడ్‌తో కుక్కను చంపి.. తర్వాత భర్తపై ప్రయోగం