ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఎదురుచూపులే.. ఎంసెట్​ వెబ్​ ఆప్షన్లు ఎప్పుడో..?

తెలంగాణలో ఈ ఏడాది 97 వేల 741 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 3 వేల 152 సీట్లు యూనివర్సిటీ కళాశాలల్లో ఉండగా.. మిగతా 94 వేల 589 సీట్లు ప్రైవేటు కాలేజీల్లో ఉన్నాయి. కొత్త కోర్సుల్లో సుమారు 19 వేల సీట్లకు అనుమతి లభించింది. అయితే కళాశాలలు, కోర్సుల అనుబంధ గుర్తింపు ప్రక్రియ జాప్యం కావడంతో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ గందరగోళంగా మారింది. నిన్న వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసహనానికి గురయ్యారు.

telangana students awaiting for eamcet web counselling 2020
తెలంగాణ: ఎదురుచూపులే.. ఎంసెట్​ వెబ్​ ఆప్షన్లు ఎప్పుడో..?

By

Published : Oct 19, 2020, 1:21 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలు, సీట్ల సంఖ్యను ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 176 కళాశాలల్లో 97 వేల 741 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 162 ప్రైవేటు కాలేజీల్లో.. 94 వేల 589 సీట్లు.. 14 యూనివర్సిటీ కళాశాలల్లో 3 వేల 152 ఇంజినీరింగ్ సీట్లు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చాయి. కన్వీనర్ కోటాలో 69 వేల 365 సీట్లు భర్తీ చేయనుండగా.. మిగతావి ప్రైవేటు కాలేజీలు యాజమాన్య కోటాలో భర్తీ చేసుకోనున్నాయి.

జేఎన్​టీయూహెచ్​ 144 కాలేజీల్లో 84 వేల 24 సీట్లకు అనుబంధ గుర్తింపునిచ్చింది. ఓయూ 13 కళాశాలల్లో 8 వేల 660 సీట్లకు.. కాకతీయ యూనివర్సిటీ 5 కళాశాలల్లో 1905 సీట్లకు ఆమోదముద్ర వేశాయి. ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 30 కొత్త కోర్సుల్లో దాదాపు 19 వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

కొత్త కోర్సులకు అనుమతి, కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియలో జాప్యం వల్ల ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. నిన్న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఎప్పుడు మొదలవుతుందో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోజంతా నిరీక్షించారు. షెడ్యూలు ప్రకారం విద్యార్థులు ఆదివారం నుంచి ఈనెల 20 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. దీంతో ధ్రువపత్రాల పరిశీలన పూర్తైన సుమారు 45 వేల మంది విద్యార్థులు ఉదయం నుంచి ఎంసెట్ వెబ్‌సైట్ చూస్తూనే ఉన్నారు. కొత్త కోర్సులకు ఎన్​ఓసీ ఇస్తూ ఈ నెల 17న విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీలు కొత్త కోర్సుల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేందుకే సాయంత్రం దాటింది. కళాశాలలు, కోర్సుల వివరాలతో వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చేందుకు కౌన్సెలింగ్ అధికారులు.. రాత్రంతా కసరత్తు చేశారు.

ఇవీచూడండి:

ఎంసెట్​ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లపై గందరగోళం

ABOUT THE AUTHOR

...view details