ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 15, 2020, 11:59 PM IST

ETV Bharat / city

'రాష్ట్ర మూలధనం లాంటి నేలతల్లిని వేలమేస్తున్నాడు'

రాజధాని పై ప్రభుత్వం చర్యలను తెదేపా నేతలు ట్విట్టర్ ద్వారా ధ్వజమెత్తారు. 150 రోజులుగా ప్రజారాజధానిని కాపాడడానికి అమరావతి రైతులు, కూలీలు, మహిళలు,అన్నివర్గాలు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని తెదేపా శ్రేణులు అన్నాయి. కోర్టు ఆదేశాలను గౌరవించి ప్రజారాజధానిగా ప్రజలు అడుగుతున్నందున సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు.

tdp tweets on amaravati cap
అమరావతిపై తెదేపా నేతల వ్యాఖ్యలు

అమరావతి రాజధానిగా కావాలంటూ రైతులు చేస్తున్న నిరసనలు 150వ రోజుకు చేరుకున్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. 65మంది అమరవీరులకు జోహార్లు తెలిపారు. కోర్టు ఆదేశాలను గౌరవించి ప్రజారాజధానిగా ప్రజలు అడుగుతున్నందున సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్

న‌వ‌ర‌త్నాలు అమలుకు ప్ర‌భుత్వ ఆస్తులు అమ్మ‌కం త‌గ‌దని మరోనేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. ప‌థ‌కాల‌న్నింటికీ తండ్రి వైఎస్ పేరు, త‌న‌యుడు జ‌గ‌న్‌రెడ్డి పేరు పెట్టుకున్న‌ప్పుడు వాళ్ల ఆస్తులైన‌ ఇడుపుల‌పాయ ఎస్టేటో, లోట‌స్‌పాండో వేలం వేస్తే అర్థ‌వంతంగా ఉండేదన్నారు.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్

ద‌ళిత రైతుల దీక్ష‌కు మ‌ద్ద‌తు తెలిపేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావ‌ణ్‌కుమార్ ని పోలీసులు అడ్డుకోవ‌డం ద‌ళితుల‌ను అవ‌మానించ‌డ‌మేనని కే ఎస్.జవహర్ పేర్కొన్నారు. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికి ద‌ళితులంటే ఎందుకింత చిన్న‌చూపని మండిపడ్డారు.

కే ఎస్.జవహర్ ట్విట్టర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ద‌ళితులు శాంతియుతంగా నిర‌స‌న తెలిపే హ‌క్కునీ కోల్పోయారని తెదేపా మహిళాధ్యక్షురాలు అనిత ఆగ్రహం వ్యక్తం చేసారు. అంబేద్క‌ర్ స్మృతివ‌నం వ‌ద్ద దీక్ష‌లో వున్న ద‌ళిత‌రైతుల‌కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావ‌ణ్‌కుమార్ అడ్డ‌గింత‌ను తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ దళిత వ్యతిరేక ప్రభుత్వమని స్పష్టం చేశారు.

తెదేపా మహిళాధ్యక్షురాలు అనిత ట్విట్టర్

ఉచితంగా ఇచ్చిన వేలఎకరాలను కాదని ఉన్న డబ్బంతా రంగులకూ.. హంగులకూ జగన్ ధారబోశాడని విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర మూలధనం లాంటి నేలతల్లిని వేలమేస్తున్నాడని అయన ధ్వజమెత్తారు. చంద్రబాబు కష్టించి సృష్టించిన ప్రగతి ...ఇవాళ అధోగతి పాలవుతుందని ఆక్షేపించారు.

ఎమ్మెల్యే గద్దె రాంమోహన్ ట్విట్టర్

ఇదీచూడండి.ఇంతా బిల్లు వస్తే..ఎలా బతికేది..?

ABOUT THE AUTHOR

...view details