ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పోలీసులను ఇంతలా ఉపయోగించుకోవడం ఎన్నడూ చూడలేదు' - ఎంపీ కనకమేడల రవీంద్ర వార్తలు

రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను అన్నిరకాలుగా బెదిరిస్తున్నారని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను వెలుగులోకి తెచ్చిన వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను ఇంతలా ఉపయోగించుకోవడం గతంలో ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు.

MP kanakamedala ravindra kumar
MP kanakamedala ravindra kumar

By

Published : Jan 18, 2021, 6:17 PM IST

రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ప్రతిపక్ష నేతలను అన్ని రకాలుగా బెదిరిస్తున్నారని విమర్శించారు. సోమవారం దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... వైకాపా సర్కార్​పై ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను వెలుగులోకి తెచ్చిన వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. నిరసన తెలిపిన ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని అన్నారు. పోలీసులను ఇంతలా ఉపయోగించుకోవడం గతంలో ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబును దూషించడమే ఎంపీ విజయసాయిరెడ్డి పని. రామతీర్థంలో ఆలయంలోకి వెళ్లకుండా చంద్రబాబును ఎందుకు అడ్డుకున్నారు. ఆలయాల ధర్మకర్తగా అశోక్‌గజపతిరాజును ఎందుకు తొలగించారు. పరిపాలనలో విఫలమైన మంత్రులను మీరు తొలగించారా. కోర్టులు, న్యాయమూర్తులను బెదిరించేలా వ్యవహరిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో పంటకు గిట్టుబాటు ధర లేక... రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. వ్యవసాయం చేసేందుకు వీల్లేని పరిస్థితులు కల్పించారు- కనకమేడల రవీంద్ర కుమార్, ఎంపీ

ఇదీ చదవండి :నన్నెవరూ పట్టించుకోవడం లేదు.. ఎమ్మెల్యే రోజా ఆవేదన

ABOUT THE AUTHOR

...view details