ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 12, 2020, 11:32 PM IST

ETV Bharat / city

అచ్చెన్నాయుడి అరెస్టుపై తెదేపా శ్రేణుల నిరసన

అచ్చెన్నాయుడు అరెస్టును తెదేపా నేతలు ఖండించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని నేతలు మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేసిన అచ్చెన్నాయుడిని... వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అచ్చెన్నాయుడు అరెస్ట్​ పై తెదేపా శ్రేణుల నిరసన
అచ్చెన్నాయుడు అరెస్ట్​ పై తెదేపా శ్రేణుల నిరసన

తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్టును కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఖండించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని ఆరోపించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా తెదేపా శ్రేణులు ఆందోళన చేశారు. క్రాస్ రోడ్డు కూడలిలోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. బలహీన వర్గాల నాయకుడిని అరెస్టు చేయడం సరికాదని తెదేపా నాయకులు హితవుపలికారు.

అచ్చెన్నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ గుంటూరులో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక లాడ్జ్ సెంటర్లో ఉన్న అంబేడ్కర్​ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తంచేశారు.

అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడం పట్ల తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని వైకాపా ప్రభుత్వం కూని చేస్తుందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం ఆరోపించారు. తుని నియోజకవర్గ పరిధిలోని తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని అక్రమ అరెస్టులు నశించాలి... అచ్చెన్నాయుడును వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు.

అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ కడప జిల్లా రైల్వే కోడూరులో తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటినుంచి తెదేపా నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. అచ్చెన్నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ రాయచోటిలో తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతున్న అచ్చెన్నాయుడును చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారని తెదేపా నేతలు దుయ్యబట్టారు.

ఇదీ చూడండి:మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details