ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LOKESH FIRE ON CM JAGAN : ధర్మాన్ని పాటించని జగన్ కు.. ఆ విషయం ఎలా తెలుస్తుంది: లోకేశ్ - CM Jagan

LOKESH FIRE ON CM JAGAN : సీఎం జగన్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మాన్ని పాటించని జగన్ రెడ్డికి.. అనువంశిక ధర్మకర్తను గౌరవించడం ఏం తెలుస్తుందని మండిపడ్డారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్

By

Published : Dec 23, 2021, 8:41 PM IST

LOKESH FIRE ON CM JAGAN : ధర్మాన్ని పాటించని జగన్ రెడ్డికి అనువంశిక ధర్మకర్తను గౌరవించడం ఏం తెలుస్తుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్‌కు తెలియకుండానే బోడికొండపై రామాలయ నిర్మాణం తలపెట్టడం, నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నించిన అశోక గజపతి రాజుపైనే కేసు నమోదు చెయ్యడం హిందూ ధర్మంపై జరుగుతున్న పైశాచిక దాడికి నిదర్శనమని అన్నారు.

ఆలయాలకు రక్షణ కల్పించడంలో విఫలమైన మంత్రులు.. ఇప్పుడు ఏకంగా దేవాలయాల సంప్రదాయాలు పాటించకుండా అపచారం తలపెడుతున్నారని లోకేశ్‌ మండిపడ్డారు.

ఇదీచదవండి :

ABOUT THE AUTHOR

...view details