రీయింబర్స్‌మెంట్‌ని చెల్లించాలంటూ విశాఖ, కృష్ణా, తూర్పుగోదావరి, విజయనగరం, కడప, కర్నూలు జిల్లాల్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ నిర్వహించారు. ఏడాది నుంచి రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో...ధ్రువపత్రాలు తీసుకునేటప్పుడు డబ్బు కట్టాల్సిన పరిస్థితి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది.
'ఫీజు రియంబర్స్‌మెంట్ చేయండి... సర్టిఫికెట్లు ఇప్పించండి' - fees reimbursement problems
రియంబర్స్‌మెంట్ ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఏడాది నుంచి ప్రభుత్వాలు.. ఫీజు చెల్లించకపోవడంతో కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకునేటప్పుడు పేద విద్యార్థులు డబ్బులు కట్టే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య పరిష్కరించాలంటూ ఉద్యమిస్తున్నారు. ఇలా పోరుబాట పట్టిన విజయనగరం జిల్లాలో విద్యార్థులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు.

fees reimbursement problems
'రియంబర్స్‌మెంట్ చెల్లించండి: సర్టిఫికెట్లు ఇప్పించండి'
విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్ధులు చేపట్టిన ధర్నా రసాభాసగా మారింది.సమస్యలపై స్వయంగా కలెక్టర్ హామీ ఇవ్వాలని విద్యార్ధులు డిమాండ్ చేయడంతో పరిస్థితి లాఠీచార్జీకి దారి తీసింది.కలెక్టరేట్ వద్ద ఎస్‌ఎఫ్‌పైఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు జిల్లా నలుమూల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు.