నిరవధిక వాయిదా పడిన చోట సాధ్యమైనంత త్వరలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. 649 ఎంపీపీ స్థానాలకు శుక్రవారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించగా 15 చోట్ల వాయిదా పడ్డాయి. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం శనివారం మళ్లీ ఎన్నికల ఏర్పాట్లు చేశారు. ఏడు చోట్ల ఎంపీపీ, ఉపాధ్యక్షుల ఎన్నికలను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. మరో ఎనిమిది చోట్ల కోరం లేని కారణంగా, సభ్యుల గైర్హాజరుతో ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం శుక్ర, శనివారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి. సాధ్యం కాని చోట ఎన్నికలు నిరవధిక వాయిదా వేసి ఎన్నికల సంఘానికి నివేదిక పంపాలి.
20 చోట్ల ఉపాధ్యక్షుల ఎన్నిక వాయిదా...