ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Rain update: సీమ జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు - వర్షాలు

Rain update: సీమ జిల్లాలను వానలు వదలడం లేదు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో....భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరి...ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Rain update
వర్షాలు

By

Published : Aug 3, 2022, 12:50 PM IST

Rain update: కర్నూలు జిల్లాలో జోరువానలు కురుస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో.....కుంభవృష్టి వల్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. దేవనకొండ మండలం తెర్నేకల్, కుంకునూరు గ్రామాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. తెర్నేకల్ లో రహదారులు కాలువల్లా మారాయి. బడికి వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కొందరు విద్యార్థులను ట్రాక్టర్‌లో ఎక్కించుకుని..పాఠశాలకు తీసుకెళ్లారు. అల్లారిదిన్నె సమీపంలో వాగు...ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆస్పరిలో లోతట్టు కాలనీలు నీట మునిగాయి.

ఆదోని పట్టణంలోని పలు కాలనీల్లోకి వాన నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది.అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇస్వి గ్రామంలో కుంట చెరువు నిండి పెద్ద చెరువులోకి భారీగా నీరు ప్రవహిస్తోంది. ఇస్వి, కడితోట గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోరువానలకి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. పగటిపూట సాధారణ వర్షపాతం నమోదవుతుండగా...రాత్రి వేళల్లో భారీగా వర్షం కురుస్తోంది. వరద నీటిలోనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో.. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

రెండు రోజులగా కురుస్తున్న వర్షాలకు కడప జిల్లాలో పాపాగ్ని నదికి జలకళ సంతరించుకుంది. వేంపల్లి, చక్రాయిపేట మండలాల్లో కురిసిన వర్షాలకు పాపాగ్నికి భారీగా వరద నీరు చేరింది. నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో...అలిరెడ్డిపల్లి, తువ్వపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు నది దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details