రాజధాని తరలింపు వ్యవహారంలో జనసేన తరపున కూడా పిటిషన్ దాఖలు చేసేందుకు నేతలతో పవన్‌కల్యాణ్ సమాలోచనలు జరుపుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి ఏపీ హైకోర్టు అన్ని రాజకీయ పక్షాలకు అవకాశం ఇచ్చినందున్న దీనిపై పార్టీ నేతలతో చర్చించాలని ఆయన నిర్ణయించారు. పార్టీ నాయకుల మనోగతం తెలుసుకోవడం కోసం పవన్ కల్యాణ్ ముఖ్య నాయకులతో మాట్లాడనున్నారు. అయితే కోర్టు ఆదేశాలు ఇంకా అందవలసి ఉంది. ఈలోగానే పార్టీ నేతల అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు టెలీ సమావేశం జరిగే అవకాశం ఉంది. రాజధాని అంశంపై చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. నాయకులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.
పిటిషన్ దాఖలు చేసేందుకు నేతలతో పవన్ చర్చలు - amaravathi
రాజధాని తరలింపు వ్యవహారంలో జనసేన తరపున కూడా పిటిషన్ దాఖలు చేసేందుకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు.
Pawan