రాష్ట్రంలో అగ్నిమాపక విభాగ నిర్వహణకు నాలుగు జోన్లు ఏర్పాటు చేస్తూ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు ఇచ్చారు. విశాఖపట్నం కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో ఒకటో జోన్ గా నిర్ణయించారు. రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతో రెండో జోన్ గా పేర్కోన్నారు. గుంటూరు కేంద్రంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ట్రైనింగ్ సెంటర్లలతో మూడో జోన్ ను ఏర్పాటు చేశారు. కర్నూల్ కేంద్రంగా చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల తో జోన్ 4ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఇకనుంచి నాలుగు జోన్లుగా అగ్నిమాపక విభాగ నిర్వహణ - నాలుగు జోన్లుగా అగ్నిమాపక విభాగ నిర్వహణ
రాష్ట్రంలో అగ్నిమాపక సేవల్ని మరింత విస్తృత పరిచేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుతం ఉన్న రెండు జోన్లను పాలనా పరంగా నాలుగు జోన్లుగా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇకనుంచి నాలుగు జోన్లుగా అగ్నిమాపక విభాగ నిర్వహణ
దీంతో పాటుగా పాలనా సౌలభ్యం కోసం ఏర్పాట్లు చేసిన ఈ జోన్లకు అధికారులను నియమించేందుకు ఒక రీజినల్ ఫైర్ ఆఫీసర్ పోస్టును, రెండు ఫైర్ సర్వీసెస్ అదనపు డైరెక్టర్ పోస్టులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది. ఒకటో జోన్ లో 33 ఫైర్ స్టేషన్లు, రెండో జోన్ పరిధిలోకి 50 ఫైర్ స్టేషన్లు , మూడో జోన్ లోకి 38, నాలుగో జోన్ పరిధిలోకి 51 ఫైర్ స్టేషన్లు వస్తాయని ప్రభుత్వం తెలిపింది.