ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటి పన్నులు పెరగాలనుకుంటే... జగన్ కు ఓటేయండి: లోకేశ్

రాష్ట్రంలో ఎస్సీలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఇంటి పన్నులు పెరగాలనుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో జగన్ రెడ్డికి ఓటు వేయవచ్చని ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్​లో లోకేష్ సమక్షంలో గుంటూరు ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కంచర్ల దేవాదానం, సత్తెనపల్లి మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మెన్ ఆత్కూరి నాగేశ్వరావు అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

naralokesh comments on cm jagan in municipal elections
naralokesh comments on cm jagan in municipal elections

By

Published : Mar 4, 2021, 9:31 AM IST

ఇంటి పన్నులు పెరగాలనుకుంటే పురపాలక ఎన్నికల్లో వైకాపాకు ఓటేయాలని తెదేపా ప్రథాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం లోకేశ్ సమక్షంలో సత్తెనపల్లి మాజీ మున్సిపల్ వైస్​ ఛైర్మని ఆత్కూరి నాగేశ్వరరావు, వైకాపా గుంటూరు ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కంచర్ల దేవదానం తన అనుచరులతో కలిసి తెదేపాలో చేరారు.

'తెదేపా హయాంలో ఎస్సీలపై దాడి చేసేందుకు ఎవరైనా భయపడేవారు. జగన్​ పాలనలో మాత్రం వారిపై దమనకాండ కొనసాగుతోంది. కుడిచేత్తో వంద రూపాయలిస్తూ ఎడంచేత్తో వెయ్యి రూపాయలు కొట్టేస్తున్నారు. రూ. వేల కోట్ల అప్పల ఊబిలో రాష్ట్రాన్ని ముంచేశారు'- లోకేశ్

ABOUT THE AUTHOR

...view details