ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరప్రదాయిని అయినటువంటి పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ కల్లా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అన్నారు. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కావడంతో ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధుల కోసం వేచి చూడకుండా ఇప్పటికే ప్రాజెక్టుపై 3వేల805 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు.
ప్రక్రియను పూర్తి చేస్తాం: నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి