'సీఎం జగన్ ఏమాత్రం సీరియస్ లేనట్లు మాట్లాడారు'
కరోనా పట్ల ఏమాత్రం సీరియస్ లేనట్లు... ప్రధాని నిర్వహించిన సీఎంల సమావేశంలో జగన్ మాట్లాడారని తెదేపా ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు. లాక్డౌన్ రెడ్జోన్లకే పరిమితం చేయాలని ముఖ్యమంత్రి అనటం బాధ్యతారాహిత్యమని ఆరోపించారు.
ప్రధాని మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో జగన్ వ్యాఖ్యలు బాధాకరమని తెదేపా ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు. కరోనా పట్ల ఏమాత్రం సీరియస్ లేనట్లు జగన్... ప్రధానితో మాట్లాడారన్న ఆయన లాక్డౌన్ కొన్ని జోన్లకే పరిమితం చేయాలని అనడం బాధ్యతారాహిత్యమేనన్నారు. రమేశ్ కుమార్ను తొలగించి తన నియంతృత్వ ధోరణిని జగన్ బయటపెట్టారని అన్నారు. హెల్త్ ఎమర్జెన్సీలో కూడా రాజకీయాలకే జగన్ ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎవరూ ప్రవర్తించని విధంగా వైద్యులను జగన్ సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ప్రాథమిక కార్యాచరణ కూడా లేకుండా ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టనట్లు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.