Miss grand India: జైపూర్‌లో జరిగిన మిస్ గ్రాండ్ ఇండియా-2022 అందాల పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన ప్రాచీ నాగ్‌పాల్ విజేతగా నిలిచారు. మిస్ గ్రాండ్ ఇండియా కీరిటం అందుకొని తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన నాగ్‌పాల్‌కు.. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె తల్లిదండ్రులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
హైదరాబాద్‌లో మెరిసిన.. "మిస్ గ్రాండ్ ఇండియా" అందాల భామ
Miss grand India: మిస్ గ్రాండ్ ఇండియా-2022 అందాల పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన ప్రాచీ నాగ్‌పాల్ విజేతగా నిలిచారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఈ విజయం సాధించానన్నారు.
జీ స్టూడియో ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న జైపూర్‌లో జరిగిన ఈ అందాల పోటీల్లో మిస్ గ్రాండ్ ఇండియా అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రాచీ అన్నారు. ఈ పోటీల్లో 29 మంది అమ్మాయిలు పోటీపడగా హైదరాబాద్ నుంచి తాను పాల్గొన్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కృషి, పట్టుదలతో ఈ స్థాయికి చేరినట్లు ఆమె చెప్పారు. త్వరలో జరిగబోయే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కీరిటం గెలువడమే తన లక్ష్యమని చెప్పారు.
ఇవీ చదవండి: