తీర ప్రాంతంలో ఆయిల్ నిక్షేపాలను వెలికి తీస్తున్న సంస్థలు... కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మత్య్సకారుల సంక్షేమానికి నిధులు కేటాయించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. సచివాలయంలో ఓఎన్జీసీ, గెయిల్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఓఎన్‌జిసి, గెయిల్ నుంచి రావాల్సిన సీఎస్‌ఆర్ బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే చెల్లించాలని కోరారు.
ఓఎన్జీసీ, గెయిల్ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష - సీఎస్‌ఆర్ నిధులపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
ఓఎన్జీసీ, గెయిల్ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద... మత్స్యకారుల సంక్షేమానికి నిధులు కేటాయించాలని కోరారు.

minister-peddireddy-review-on-ongc-csr-funds
ఆయిల్ నిక్షేపాల వెలికితీత కారణంగా ఏర్పడే కాలుష్యం వల్ల మత్స్యకారుల వేటకు, వారు వేటాడే ప్రాంతాల్లోని మత్స్యసంపదకు ఎటువంటి ఇబ్బంది లేకుండా... జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంస్థలు తీరప్రాంతంలో జరిపే తవ్వకాల కోసం చేసిన దరఖాస్తులను కూడా పరిశీలించి... వెంటనే అనుమతులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి : భాజపా బలపడుతోంది... అందుకే...!