కృష్ణా జలాలపై ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని.. తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామన్నారు. శనివారం నారాయణపేట జిల్లాలో మంత్రి పర్యటించారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును ప్రారంభించారు. నారాయణపేటకు 10 కి.మీ. దూరంలోనే కర్ణాటక ఉందని, ఆ రాష్ట్రంలో మన దగ్గర అమలవుతోన్న ఏ ఒక్క పథకమైనా అమలవుతుందా? అని ప్రశ్నించారు. రైతుబంధు, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు కర్ణాటకలో ఉన్నాయో.. లేవో చెప్పాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తాం