తెలంగాణలో లేఅవుట్‌ల నిబంధనలు (layout new rules) మరింత పటిష్ఠం అయ్యాయి. ప్రభుత్వం దీనిపై ఉత్తర్వలు (Orders)జారీ చేసింది. లేఅవుట్‌ల అనుమతికి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. స్వీయ ధ్రువీకరణ ద్వారా లేఅవుట్ అనుమతినిస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన లేఅవుట్ అభివృద్ధిదారులను బ్లాక్‌లిస్టులో(blacklist) ఉంచనున్నారు. లేఅవుట్ వేసిన తర్వాత... అదే విధంగా ప్లాట్ల కనీస విస్తీర్ణాన్ని 60 చదరపు గజాలు, కనీస వెడల్పు 20 అడుగులుగా నిర్ధారించింది. ప్రతి లేఅవుట్‌లో 2.5 శాతం స్థలాన్ని అదనంగా సామాజిక వసతుల కల్పించడానికి కేటాయించాల్సి ఉంటుంది. దీనికి ఉండాల్సిన అప్రోచ్ రోడ్డు 60 అడుగులు ఉంచాలి. 50 హెక్టార్లకు మించిన విస్తీర్ణంలో వేసే లేఅవుట్‌లకు పర్యావరణ అనుమతి తప్పనిసరి అని సర్కారు స్పష్టం చేసింది.
నగరపాలికలు, పురపాలక సంఘాలకు వర్తింపు
లేఅవుట్‌లో 15 శాతం స్థలాన్ని పురపాలక శాఖకు తనఖా పెట్టాల్సి ఉంటుంది. అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో రెండేళ్లలో మౌలిక వసతులు కల్పించకుండా... నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తనఖా పెట్టిన 15 శాతం ప్లాట్ల విస్తీర్ణాన్ని పురపాలక శాఖే విక్రయించి మౌలిక వసతులు కల్పించేలా అధికారం కట్టబెట్టింది. కొత్త లేఅవుట్ నిబంధనలు(new layout rules) ఈ నెల 5 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ లేఅవుట్‌లకు అనుమతి మంజూరు చేయనుంది. కొత్త లేఅవుట్ నిబంధనలు జీహెచ్‌ఎంసీ(ghmc), హెచ్‌ఎండీఏ(hmda) మినహా రాష్ట్రంలోని అన్ని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు వర్తిస్తాయి.
నిర్దేశించిన వాటికి మాత్రమే వినియోగం