ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసు.. 4 నెలలు సమయమడిగిన సీబీఐ - ఏపీ హైకోర్టు

హైకోర్టు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితులను ప్రశ్నించేందుకు 4 నెలల సమయం కావాలని.. న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. ఈ కేసుపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. నిందితులంతా వేర్వేరు దేశాల్లో ఉన్నారని.. అందుకే అంత సమయం కావాలని సీబీఐ విన్నవించింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి 31కి వాయిదా వేసింది.

ap highcourt
ఏపీ హైకోర్టు

By

Published : Dec 14, 2020, 1:49 PM IST

హైకోర్టు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ కేసులో ఇప్పటికే ఎఫ్​ఐఆర్ నమోదు చేశామని సీబీఐ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. నిందితులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నారని.. వారిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు 4 నెలల సమయం పడుతుందని విన్నవించారు. సీబీఐకు ఆ సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి 31కు హైకోర్టు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details