Termination of GOIR website: 'నూతన విధానం ఎందుకు తీసుకొచ్చారో అఫిడవిట్ దాఖలు చేయండి' - goir website issue in ap

12:34 September 30
జీవోఐఆర్ వెబ్‌సైట్ రద్దుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ
జీవోఐఆర్ వెబ్‌సైట్ రద్దుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచే వెబ్‌సైట్‌ను రద్దుచేస్తూ ఇచ్చిన జీవోపై హిందూపురానికి చెందిన ఎస్.ఆర్.ఆంజనేయులుతో పాటు మరో ఇద్దరు పిటిషన్లు వేశారు. ఏపీ ఈ-గెజిట్‌లో జీవోలు ఉంచుతామని ప్రభుత్వం చెప్పడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారానికి ఒక్కసారి జీవోలు ఉంచడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. కాన్ఫిడెన్షియల్ పేరుతో జీవోలు దాచిపెట్టడం చట్ట విరుద్ధమని అన్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం విరుద్ధమని పిటిషనర్ల న్యాయవాది వై.బాలాజీ వాదించారు. నూతన విధానం ఎందుకు తీసుకొచ్చారో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 27కు వాయిదా పడింది.
ఇదీ చదవండి: అమరావతి భూముల ఆంశంపై హైకోర్టులో విచారణ వాయిదా