తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా.. హైదరాబాద్‌లో జరిపిన ఈడీ సోదాల్లో భారీగా నగదు, నగలు వెలుగులోకి వచ్చాయి. గతంలో పెను వివాదాస్పదమైన ఈఎస్ఐ స్కాం కుంభకోణానికి సంబంధించి.. హైదరాబాద్ నగరంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముమ్మరం చేసింది. ఇవాళ ఉదయం నుంచి నగరంలోని పదికి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ.. బారీగా నగదు, కోటి రూపాయలకు పైగా విలువైన నగలు, బ్లాంక్ చెక్కులు, ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకుంది.
మాజీ కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, నాయిని మాజీ పీఎస్ ముకుంద రెడ్డి, నిందితురాలు దేవికారాణి ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఇతర నిందితుల ఇళ్లలోనూ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది.