స్పృహ తప్పిన అమరావతి రైతు.. శిబిరంలోనే సెలైన్‌తో చికిత్స - మందడం దీక్షలో స్పృహతప్పిన రైతు వార్తలు
రాజధాని ప్రాంతంలో 19వ రోజూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మందడంలో టెంట్ వేసి రోడ్డుపై బైఠాయించి 'అమరావతే ముద్దు మూడు రాజధానులు వద్దు' అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. మందడంలో దీక్ష చేస్తూ సుబ్బయ్య అనే రైతు నీరసంతో పడిపోయాడు. శిబిరంలోనే అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సెలైన్ ఎక్కించారు. ఇలాంటి పరిస్థితిలోనూ ఆ రైతు అమరావతి కోసం దీక్ష కొనసాగించారు.
స్పృహ తప్పిన రైతు