ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్లాట్‌ బుకింగ్‌ చేయకుండా రిజిస్ట్రేషన్లు జరగవు: తెలంగాణ సీఎస్​ - వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్​ వార్తలు

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. సులువుగా ఆన్‌లైన్‌ విధానంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఉంటుందన్నసీఎస్​... ముందస్తు స్లాట్‌ బుకింగ్‌ చేయకుండా రిజిస్ట్రేషన్లు జరగబోవని తెలిపారు.

telangana state chief secretary
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

By

Published : Dec 11, 2020, 6:21 PM IST

వ్యవసాయేతర ఆస్తులు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వెల్లడించారు. సులువుగా ఆన్‌లైన్‌ విధానంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఉంటుందన్నసీఎస్​... ముందస్తు స్లాట్‌ బుకింగ్‌ చేయకుండా రిజిస్ట్రేషన్లు జరగబోవని తెలిపారు. ఎల్​ఆర్​ఎస్​ లేనివారి విషయంలోనూ త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇళ్లు, ఫ్లాట్లతో పాటు ఓపెన్ ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. పెండింగ్ మ్యుటేషన్లు ధరణిలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశాం. 100 మంది అధికారులు, నిపుణులతో బీఆర్కే భవన్‌లో వార్ రూం అందుబాటులో ఉంచాం. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఈ-పాస్‌బుక్ ఇస్తాం. మెరూన్ రంగు పాసుపుస్తకాలు కూడా ఇస్తాం. గతంలో 16 లక్షల లావాదేవీల్లో 10 వేలే స్లాట్ బుకింగ్ ద్వారా జరిగేవి. ప్రస్తుతం వంద శాతం స్లాట్ బుకింగ్ ద్వారానే జరుగుతున్నాయి. రిజిస్ట్రార్లు సహా అధికారులు ఎవరికీ విచక్షణాధికారాలు ఉండవు. రాష్ట్ర రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. డేటాకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ 18005994788 ఏర్పాటు చేశాం. - సోమేశ్​ కుమార్​, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.

ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వివరాలు వెల్లడిస్తున్న తెలంగాణ సీఎస్​

ఇవీ చూడండి:రుణాలు ఆశాజనకంగా లేవు..బ్యాంకుల తీరుపై సీఎం జగన్ అసంతృప్తి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details