రీటెండరింగ్ ఆలోచన విరమించుకోవాలి: కె. రామకృష్ణ - cpi state secretary wrote letterr to cm
పోలవరం రీటెండరింగ్ నిర్ణయం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సీఎం కు లేఖ రాశారు. నవయుగ కంపెనీతోనే పనులు కొనసాగించాలని కోరారు.

ముఖ్యమంత్రి జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం విషయంలో ప్రభుత్వం రీటెండరింగ్ ఆలోచన విరమించుకోవాలని తెలిపారు. నవయుగ కంపెనీతో పనులు కొనసాగించాలని లేఖలో ప్రస్తావించారు. వాస్తవ ధర కన్నా 14 శాతం తక్కువకే నవయుగ పనులు చేసిందని, కాంక్రీట్ పనులు చేయటంలో గిన్నిస్ రికార్డు సాధించిందని గుర్తు చేశారు. పోలవరం రీటెండరింగ్ నిర్ణయాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా తప్పుబట్టిందని అన్నారు. రీ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగి, పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు.