రాష్ట్రంలో కరోనా నివారణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష 11.30 గంటలకు జరగనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమీక్షలో నాలుగో విడత లాక్డౌన్పై కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై సీఎం చర్చించనున్నారు. ప్రజారవాణా వాహనాలను అనుమతించే అంశంపై చర్చించి కీలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం ఇచ్చిన అనుమతుల మేరకు రాష్ట్రంలో అనుమతించిన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై చర్చించనున్నారు. ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు తయాలు చేయాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు. అనంతరం ఏపీ ఎన్విరాన్మెంట్ చట్టం-2020పై మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం సమావేశం కానున్నారు.
నేడు ముఖ్యమంత్రి జగన్ సమీక్ష - జగన్ సమీక్ష
కరోనా నివారణ వ్యాప్తి, ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం నేడు సమీక్ష నిర్వహించనున్నారు. లాక్డౌన్ పెంపు, ప్రజారవాణా వంటి పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి జగన్ సమీక్ష