ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భద్రతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్‌ను సందర్శించే విదేశీ ప్రముఖులకు అక్కడి ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయదనీ.. అందుకే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఏర్పాట్లు చూసుకుంటోందని అధికారులు వివరించారు. సాధారణంగా జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్న ప్రముఖులు ఏ దేశానికి వెళితే అక్కడి ప్రభుత్వాలే వారికి భద్రతా ఏర్పాట్లు చేస్తుంటాయనీ, అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అలాంటి విధానం లేదని తెలిపారు. సీఎంకు భద్రత కల్పించే బాధ్యతను ఒక ప్రైవేటు భద్రతా ఏజెన్సీకి అప్పగించినట్టు వెల్లడించారు.
ఇజ్రాయెల్‌కు ఆ విధానం లేదు.. అందుకే ఇలా! - ఇజ్రాయెల్
ఇజ్రాయెల్‌ను సందర్శించే విదేశీ ప్రముఖులకు అక్కడి ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయదనీ, అందుకే ముఖ్యమంత్రి జగన్ జెరూసలెం పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చులతో భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.

ఇజ్రాయెల్‌కు ఆ విధానం లేదు.. అందుకే ఇలా!