ముఖ్యమంత్రి జగన్ రెండ్రోజుల దిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో.. కేంద్ర మంత్రులను కలిసి.. రాష్ట్ర ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిన్న ఒకసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసిన సీఎం జగన్.. ఇవాళ మరోసారి చర్చించారు. అరగంట పాటు.. రాష్ట్ర ప్రాజెక్టులపై మాట్లాడారు.
అంతకుముందు.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశారు. సీఎం వెంట వైకాపా ఎంపీలు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం సహకారం ఇవ్వాలని కోరారు. దిల్లీ నుంచి నేరుగా సీఎం జగన్ తిరుపతి చేరుకున్నారు.