కిడ్నీ బాధితుల పట్ల శ్రద్ధ చూపాలంటూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. లాక్డౌన్ కారణంగా ఉద్దానం సహా ఇతర ప్రాంతాల్లోని కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకోలేకపోతున్నారని తెలిపారు. డయాలసిస్ కేంద్రాలన్ని కోవిడ్ స్క్రీనింగ్ పరీక్షల్లో నిమగ్నమైనందున కిడ్నీ రోగులకు సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. కోవిడ్ ఫలితాల ఆలస్యం కారణంగా డయాలసిస్ కేంద్రాల్లో కిడ్నీ రోగులకు వైద్యం అందక... వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం వస్తుందన్నారు. రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల డయాలసిస్ కేంద్రాలకు వెళ్లేందుకు రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించి కిడ్నీ రోగులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారికి రవాణా సౌకర్యం కల్పించాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
కిడ్నీ బాధితులను ఆదుకోండి : చంద్రబాబు
లాక్డౌన్ వల్ల రవాణా సౌకర్యం లేకపోవటం వల్ల డయాలసిస్ కేంద్రాలకు వెళ్లలేక కిడ్నీ బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన చెందారు. ఈ మేరకు చంద్రబాబు వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాశారు. డయాలసిస్ కేంద్రాలను కోవిడ్ ఆసుపత్రులుగా మార్చటం వల్ల బాధితులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు కోరారు.
చంద్రబాబు