కియాకు శుభాకాంక్షలు.. ప్రభుత్వానికి హెచ్చరికలు - chandrababu angry on ycp, over attacks on tdp activits
తెదేపా కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ దాడులపై ప్రభుత్వం, సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు అధైర్యపడ్డొదని..వారికి అన్నివేళలా అండగా ఉంటానని భరోసానిచ్చారు.

అమరావతిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కియా మెుదటి కారు ఇవాళ మార్కెట్లోకి విడుదలవుతుందని అన్నారు. కియా యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో కియా నూతన ట్రెండ్ తీసుకురావాలని ఆకాంక్షించారు.
వైకాపా దాడులను సహించేదిలేదు..
తమపై వైకాపా నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ పలువురు తెదేపా కార్యకర్తలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. వత్సవాయి మండలంలోని ఓ కుటుంబం చేసిన ఫిర్యాదుకు ఆయన స్పందిస్తూ.. వైకాపా దాడులను సహించేదిలేదని హెచ్చరించారు. రాష్ట్రంలో వైకాపా అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దాడులపై పెద్దఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. బాధిత కుటుంబానికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.