తెలంగాణలో అద్భుతం చోటు చేసుకుంది. ఇంద్ర ధనస్సు మాదిరి సూర్యుని చుట్టూ వలయం ఏర్పడింది. ఉదయం పది గంటల నుంచి ఇది కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. ఈ సుందర దృశ్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురైన ప్రజలు... తమ సెల్‌ఫోన్లలో బంధించారు.
సాంకేతికంగా ఈ పరిణామాన్ని 'హలో' అంటారని నిపుణులు చెబుతున్నారు. దట్టమైన మేఘాలు ఏర్పడి.. వాటిలో ఘనీభవించిన నీటి బిందువులపై సూర్యకిరణాలు పడినప్పుడు ఇలాంటి దృశ్యం ఆవిష్కృతం అవుతుందట. మంచు బిందువులపై పడిన కిరణాలు పరావర్తనం చెంది ఇలా ఇంద్ర ధనస్సు రంగుల్లో కనిపిస్తాయని వారంటున్నారు. సాధారణ పరిభాషలో దీనిని వరద గూడు అని అంటారని... ఇలా ఏర్పడితే ఆ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతులు విశ్వసిస్తుంటారు.