బీటెక్‌లో ఈ ఏడాది ప్రత్యేకంగా కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), డేటా సైన్సు, కృత్రిమ మేధస్సు- మెషీన్ లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించింది. మార్కెట్‌లో డిమాండున్న వీటిని కొత్త కోర్సులుగా ప్రవేశపెట్టింది. వీటితోపాటు కంప్యూటర్ సైన్సు ఇంజినీరింగ్ బ్రాంచిలో కృత్రిమ మేధస్సు, డేటా సైన్సు, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు- మెషీన్‌లెర్నింగ్, మెకానికల్‌లో రోబోటిక్ కోర్సులకు ఆమోదం తెలిపింది.
సాఫ్ట్‌వేర్ విభాగంలోనే అధికం..
ఈ ఏడాది ఏఐసీటీఈ ఆమోదించిన సీట్లలో సగానికి పైగా సీట్లు రెండు కోర్సుల్లోనే ఉన్నాయి. కంప్యూటర్ సైన్సు, ఈసీఈల్లోనే విద్యా సంస్థలు అత్యధిక సీట్లను తీసుకున్నాయి. మొత్తం 1,43,254 సీట్లు ఉండగా వీటిల్లో ఈ రెండు బ్రాంచిలవి 76,332 సీట్లు ఉన్నాయి.
బీటెక్‌లో కృత్రిమ మేధ కోర్సు... కొత్తగా డేటా సైన్సు, ఏఐ-మెషీన్ లెర్నింగ్ - btech students
బీటెక్‌లో ఈ ఏడాది ప్రత్యేకంగా కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), డేటా సైన్సు, కృత్రిమ మేధస్సు- మెషీన్ లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించింది.
బీటెక్‌లో కృత్రిమ మేధ కోర్సు
ఇదీ చదవండి: