ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP HIGH COURT: పొగాకు ఉత్పత్తులపై నమోదైన వివిధ కేసులను కొట్టివేసిన హైకోర్టు - పొగాకు ఉత్పత్తులకు సంబంధించి నమోదైన కేసుల కొట్టివేత

high court On Tobacco related cases: పొగాకు ఉత్పత్తులు తయారీ, నిల్వ, రవాణా చేస్తున్నారని పేర్కొంటూ.. రాష్ట్ర వ్యాప్యంగా పలువురిపై వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. అయితే ఏపీ ఎక్సైజ్ చట్టం, ఏపీ ప్రొహిబిషన్ చట్టం కింద నమోదు చేసిన సెక్షన్ల విషయంలో దర్యాప్తును కొనసాగించుకోవచ్చని పోలీసులకు స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్.. మొత్తం 130 కేసుల్లో ఈమేరకు తీర్పు వెల్లడించారు.

high court On Tobacco Chewing
high court On Tobacco Chewing

By

Published : Jan 3, 2022, 7:45 AM IST

AP HIGH COURT NEWS: ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 సెక్షన్ 3(1)(జే)లో పేర్కొన్న ' ఆహారం ' అనే నిర్వచనం కిందికి రాదని హైకోర్టు తేల్చిచెప్పింది. పొగాకు నమలడం ఆహారంగా మానవ వినియోగానికి వాడినట్లు కాదని స్పష్టంచేసింది. శాసనం చేసేటప్పుడూ పార్లమెంట్ కూడా పొగాకు నమలడాన్ని ఆహారం అనే నిర్వచనం కిందకి తీసుకురాకూడదనే పేర్కొంది. గుట్కా పాన్ మసాలా, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తులు తయారీ, నిల్వ, రవాణా చేస్తున్నారని పేర్కొంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురిపై వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను కొట్టేసింది. మరికొన్ని కేసుల్లో ఐపీసీ, ఎఫ్ఎస్ఎస్ చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లను రద్దు చేసింది. అయితే ఏపీ ఎక్సైజ్ చట్టం, ఏపీ ప్రొహిబిషన్ చట్టం కింద నమోదు చేసిన సెక్షన్ల విషయంలో దర్యాప్తును కొనసాగించుకోవచ్చని పోలీసులకు స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్.. మొత్తం 130 కేసుల్లో ఈమేరకు తీర్పు వెల్లడించారు.

పొగాకు ఉత్పత్తుల తయారీ, రవాణా, విక్రయం.. తదితర విషయాలపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. వాటిని కొట్టేయాలని దాఖలైన మొత్తం 130 వ్యాజ్యాలపై న్యాయమూర్తి విచారణ చేశారు. ఈ సందర్బంగా.. పొగాకు నమలడం.. ఆహార భద్రత చట్ట ప్రకారం ' ఆహారం ' అనే నిర్వచనం కిందికి వస్తుందా ? లేదా ? అనే అంశంపై లోతైన విచారణ జరిపారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. పొగాకు నమలడం చట్టంలోని ఆహారం అనే నిర్వచనం కిందికి వస్తుందన్నారు. పొగాకు పదార్థాలలో నికోటిన్ ఉంటుందన్నారు. నమలడం ద్వారా జీర్ణవ్యవస్థకు చేరుతుందన్నారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం ఆహారంగా పరిగణించాలన్నారు. ఆహార భద్రత చట్టం కింద నమోదు చేసిన కేసులను కొట్టేయవద్దని కోరారు.

' ఆహారం ' అనే నిర్వచనం కిందికి రాదు

ఆ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. మానవుల ఆహారంగా పొగాకును వినియోగించరన్నారు. మనుగడకోసం పొగాకును మానవులు ఆహారంగా తీసుకోరన్నారు. ఉత్తేజం పొందడానికి మాత్రమే నములుతారన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు నమలడం ఎఫ్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 3(1)(ఏ) ' ఫుడ్ ' నిర్వచనం కిందకు వచ్చేదిగా పరిగణించలేమన్నారు. ఫుడ్ నిర్వచనం కిందకు రాదని గతంలో ధర్మాసనం తీర్పులు ఇచ్చిందని గుర్తుచేశారు. ' గమ్ నమలడం ' ఫుడ్ అనే నిర్వచనం కిందికి వస్తుందని పార్లమెంట్ చట్టం చేసేటప్పుడు పేర్కొన్నప్పటికీ .. ఉద్దేశపూర్వకంగానే పొగాకు నమలడాన్ని ఆహారం కిందకు తీసుకురాలేదన్నారు. గుట్కా పాన్ మసాలా తయారీ, రవాణ తదితర విషయాల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం- 2006 కింద నమోదు చేసిన కేసులను కొట్టేస్తున్నట్లు పేర్కొన్నారు.


ఇదీ చదవండి...Farmers Hug losses: అన్నదాతల అప్పుల సాగు.. చితికిపోతున్న వారిలో 80% కౌలు రైతులే

ABOUT THE AUTHOR

...view details