ఉపాధి హామీ పనుల చెల్లింపుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయట్లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీకి.. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ లేఖ రాశారు. 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 2500 కోట్లు ప్రభుత్వం విడుదల చేయకుండా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రం విడుదల చేసిన నిధులను ఇతర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని అన్నారు.
రెండేళ్లుగా బకాయిలు విడుదల కాకపోవటంతో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు ఆస్తులు అమ్ముకోవటంతో పాటు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బకాయిలు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.