ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో కొవిడ్ పేషంట్లకు సీటీ లేదా హెచ్ఆర్సీటీ స్కాన్ దోపిడీ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సీటీ స్కాన్‌కు ధరను నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ అనుమానితులకు సీటీ లేదా హెచ్ఆర్సీటీ స్కానింగ్‌కు గరిష్టంగా 3 వేలుగా ధరను నిర్ణయించింది. స్కానింగ్ సమయంలో వాడే పీపీఈ కిట్లు, మాస్కు, స్ప్రెడ్ షీట్ తదితర వినియోగానికి కలిపి ఈ ధరను నిర్ణయించినట్లు ఆదేశాల్లో తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లో 3 వేల కంటే ఎక్కువ ఫీజు వసూలు చేయకూడదని ఆదేశాల్లో స్పష్టం చేసింది. స్కానింగ్ అనంతరం అనుమానితుల వివరాలను కొవిడ్ డాష్ బోర్డు వెబ్ సైట్లో తప్పక నమోదు చేయాలని సూచించింది. ఈ మేరకు తగిన చర్యల తీసుకోవాలని ప్రజారోగ్యం ,కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సహా అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
కొవిడ్ బాధితులకు సీటీ స్కాన్ ధరను నిర్ణయిస్తూ ఆదేశాలు
కొవిడ్ బాధితులకు సీటీ స్కాన్ ధరను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ అనుమానితులకు సీటీ లేదా హెచ్ఆర్సీటీ స్కానింగ్‌కు గరిష్టంగా 3 వేలుగా ధరను నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో 3 వేల కంటే ఎక్కువ ఫీజు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది.
CT and HRCT scans for covid patients