ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెయిల్పై ఉన్న ముఖ్యమంత్రి అవినీతిని నిర్మూలిస్తామని ప్రకటనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అమరావతి రైతులు ప్రశ్నించారు. పరిపాలన రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ తుళ్లూరు రైతులు చేస్తున్న దీక్షలు 258వ రోజు కొనసాగాయి. రైతులకు వైకాపా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
వినాయక నిమజ్జనంలోనూ అమరావతి ఆకాంక్షను రైతులు తెలియజేశారు. గణపతి పూజలో అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. ఎస్సీలను కాపాడాలంటూ అనంతవరంలో మహిళలు అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. కృష్ణాయపాలెంలో రైతులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. వైకాపా ప్రభుత్వం కళ్లుండి.... తమ నిరసనలను చూడలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.